అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pani Puri | పానీపూరీ అంటే ఇష్టం ఉండని వారెవరు.. చిన్నా పెద్దా అంటూ ఇష్టంగా తింటారు. ఇక అమ్మాయిలైతే Girls సాయంత్రం కాగానే పానీపూరీ బండి వద్దకు వెళ్లాల్సిందే. ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ పానీపూరీ Pani Puri టేస్ట్‌ను ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే ఇక్కడ మాత్రం పానీపూరీ Pani Puri పలువురి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. మహారాష్ట్రలోని Maharashtra నాందేడ్‌లో Nanded పానీపూరి తిన్న కొందరు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఫుడ్ పాయిజన్ కావడంతో..మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫుడ్ పాయిజన్‌తో food poisoning 30 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. రోడ్డు పక్కన అమ్ముతున్న పానీపూరి తిన్న విద్యార్థులు students అనారోగ్యానికి గురవడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు doctors తలిపారు. విద్యార్థుల అస్వస్థతకు పానీపూరి కారణమై ఉండొచ్చని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.