అక్షరటుడే, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 18 నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నామినేషన్లను స్వీకరించారు. ఇప్పటి వరకు మొత్తం 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లను దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నాలుగు సెట్ల చొప్పున నామినేషన్లు వేశారు. నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 29 వరకు అవకాశం కల్పించారు.