అక్షరటుడే, వెబ్‌డెస్క్ Good News : ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు అనేక పథకాలు అందిస్తూ పేదలకి శుభవార్తలు అందిస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది నేరవర్చుకోవడం కొందరి వల్లనే అవుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు పేదలకి ఇళ్లు కట్టించేందుకు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ, ఏపీలలో పలు పథకాల ద్వారా ఇళ్లు కట్టివ్వడం జరుగుతుంది.
అయితే ఇళ్లు కట్టుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకి అదనపు సాయం చేయడంపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా ఎస్టీ, బీసీ లబ్ధి దారులకి 50 వేలు, ఎస్టీలకి రూ.75 వేలు, గిరిజనులకి లక్ష సాయం అందనుంది. పీఎంఏవై బీఎల్సీ 1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకి సాయం కూడా లభించనుందని తెలిపారు. ఇక ఎస్‌హెచ్ జీ సభ్యులకి మరో వడ్డీపై రూ.35 వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణాపై రూ.15 వేలు అందిస్తామని పార్ధసారథి అన్నారు.
Good News : వారికి గుడ్ న్యూస్..
సాధారణంగా స్థలం లేని వారికి స్థలంతో పాటు.. ఇంటిని నిర్మించి ఇవ్వనున్నారు. ప్రధానంగా పేదలు గృహసౌకర్యంతో జీవించేందుకు ఈ ఇళ్లను భూకంప నిరోధకత గల పద్ధతిలో నిర్మిస్తారు. తద్వారా అక్కడ సురక్షిత నివాస వాతావరణం ఉంటుంది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించిన, వీరిలో చాలా మంది ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేదు. ఆర్థిక స్థోమత లేక ఇల్లు నిర్మించుకోలేదు. దీంతో పేదవాడి సొంతింటి కల నిజం చేసేందుకు.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక లోను అందిస్తుంది.
ప్రభుత్వంలో స్థలం తీసుకుని ఇల్లు కట్టని వారు లోన్ ద్వారా సొంతింటి కల నెరవేర్చుకోవచ్చే అవకాశం కూడా ఉందని ఇటీవల అధికారులు చెప్పుకొచ్చారు. అయితే అర్హులు బోగస్ మాటలు నమ్మి మోసపోవద్దని కూడా పలు సూచనలు చేశారు. అధికారులమని నమ్మించి చాలా మంది.. మోసాలకు పాల్పడుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.