అక్షరటుడే, వెబ్డెస్క్ : Pavan Kalyan | సింగపూర్(Singapore)లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pavan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) కోలుకున్నాడు. దీంతో తమ కుమారుడితో కలిసి పవన్ దపంతులు ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి హైదరాబాద్(Hyderabad) వచ్చారు.
ఇటీవల సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డ విషయం తెలిసిందే. కుమారుడు కోలుకోవడంతో పవన్ సతీమణి అన్నా లేజ్‌నేవాతో నేడు తిరుమల(Tirumala) వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు.