Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద ఎక్కువ అవుతున్న ట్రోల్స్‌.. లోకేష్‌పై త‌గ్గిందేంటి?

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద ఎక్కువ అవుతున్న ట్రోల్స్‌.. లోకేష్‌పై త‌గ్గిందేంటి?
Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద ఎక్కువ అవుతున్న ట్రోల్స్‌.. లోకేష్‌పై త‌గ్గిందేంటి?

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Pawan Kalyan : సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక సెల‌బ్రిటీల మీద ట్రోలింగ్ ఏ రేంజ్‌లో న‌డుస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. చిన్నా చితకా కార‌ణాల‌కి కూడా వారిని ట్రోల్ చేస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కుల‌పై అయితే మ‌రీ దారుణంగా ట్రోల్ న‌డుస్తూ ఉంటుంది. (Nara Lokesh) నారా లోకేష్ మీద 2014 నుంచి 2019 మధ్యలో పడిన ట్రోల్స్ మాములుగా ఉండ‌వు. ఆ స‌మయంలో (Nara Lokesh) లోకేష్ వాటిని త‌ట్టుకొని నిల‌బ‌డ్డారు. 2017 నుంచి 2019 మధ్యలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ వ‌చ్చాయి. ఇప్పుడు బాబు కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద ట్రోల్స్ ఒక రేంజిలో ట్రోల్స్ న‌డుస్తున్నాయి.

Advertisement
Advertisement

Pawan Kalyan : కార‌ణం ఇదే..

అయితే ఈ మ‌ధ్య లోకేష్ (Nara Lokesh) మీద ట్రోల్స్ త‌గ్గాయి. అందుకు కార‌ణం ఆయ‌న‌కి రాజకీయ పరిపక్వత బాగా వచ్చిందని అంటున్నారు. ఆయన వాడే మాటలను కూడా ఆచీ తూచీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని అంటున్నారు. అదే సమయంలో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ మాత్రం ట్రోల్స్ బారిన పడుతున్నారు. మెగా బ్రదర్ కొత్తగా ఎమ్మెల్సీ అయిన (Naga Babu) నాగబాబు వల్లనే పవన్ ఎక్కువగా ట్రోల్స్ కి గురి అవుతున్నారని అంటున్నారు. జనసైనికుల హుషారు కోసమో లేక సభకు వచ్చే వారిని మెప్పించాలనో ప‌వ‌న్ ఒక్కోసారి నోరు జారుతుంటారు. అది ఇప్పుడు (Pawan Kalyan) ప‌వ‌న్‌ని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు (Janasena) జనసేన ఆవిర్భావ సభ జరిగితే పవన్ ని గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ ప్రాస కోసం నాగబాబు వాడిన పదాలు కూడా ట్రోల్స్ కి గురి అయ్యాయని అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Pranitha : ఇద్ద‌రు పిల్ల‌ల తల్లి అయిన కూడా ఇంత అంద‌మా.. కేక పెట్టిస్తున్న ప్ర‌ణీత లుక్స్

పవన్ ని (Pawan Kalyan) మాట మీద నిలకడ లేని మనిషి అని అంటూ ట్రోల్స్ చేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. మాట‌లు మారొచ్చు కాని, వీడియో కంటెంట్ ఎపుడూ పదిలంగా ఉంటుంది.దానిని ఆధారంగా చూపి ట్రోల్ చేస్తున్నారు. గతంలో తాను ఏమి అన్నాను అన్నది పక్కన పెట్టి కొత్తగా స్టేట్మెంట్స్ ఇస్తారు. అవే నెటిజన్లు కానీ ప్రత్యర్థి పార్టీలు కానీ పట్టుకుంటాయని అంటున్నారు. అదే విధంగా నాగబాబు (Naga Babu) అయితే ఆవేశంగా మాట్లాడుతారని పేరు. అందులో నుంచి అనేక విషయాలు తీసుకుని నెటిజన్లు ట్రోల్స్ చేస్తూంటారు. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే తక్కువ మాట్లాడడం, జాగ్రత్తగా మాట్లాడడం అని అంటున్నారు. గతంలో అయితే నాయకులకు ప్రజలకు మధ్య అనుసంధానానికి సభలు మాత్రమే ఒక ఆధారంగా ఉండేవి. ఇపుడు అలా కాదు ఎన్నో వేదికలు, గంట‌ల కొద్ది ప్ర‌సంగాలు. ఏది త‌ప్పుగా మాట్లాడిన వెంట‌నే ట్రోల్ చేస్తున్నారు. వీటి నుండి ప‌వ‌న్ కాస్త త‌ప్పించుకుంటే మంచిది.

Advertisement