అక్షరటుడే, వెబ్‌డెస్క్ Pawan Kalyan : టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న Pawan Kalyan పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక సినిమాలపై కాస్త ఫోకస్ తగ్గించాడు. అసలు Pawan Kalyan పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడలేని పూనకం వస్తుంది. బాక్సాఫీస్ రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఆయన సినిమా ఫ్లాప్ అయినా కూడా తొలి రోజు రికార్డులు క్రియేట్ చేస్తుంది. అంత దమ్మున్న హీరో. రిలీజ్ రోజు భారీ కటౌట్‌లతో, ఫ్లెక్స్‌లతో థియేటర్‌లను నింపేసి ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలపై ఫోకస్ చాలా తగ్గించాడు. అయితే ముందుగా Pawan పవన్ కమిటైన వాటిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
Pawan Kalyan : ఇది నిజమా?
అందులో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీతో పాటు హరిహర వీరమల్లు, Harihara Veeramallu, Ustad Bhagat Singh, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు. ఇందులో ఫ్యాన్స్‌తో పాటు పవన్ Pawan సైతం ఎంతో ఆసక్తిగా ఓజీ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ ఆడియెన్స్‌లో క్రియేట్ చేసిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన సభకు హాజరైన అభిమానులు OG ఓజి ఓజి అని అరుస్తూ ఉంటే కార్యకర్తల గౌరవం కోసం ఎలాంటి నినాదాలు చేయొద్దని అని ఆయన వారించడం కూడా మనం గమనించవచ్చు. ఇటీవల జరిగిన సభలో తన రెండో కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనంగా అయ్యానని, మీ అండదండలతో ముందుకు వెళ్తానని పవన్ చెప్పడం ఆయన అభిమానులని బాధించింది.
తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్‌లో పవన్ కళ్యాణ్ Pawan Kalyan తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదని , దీంతో ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని సన్నిహితులు అంటున్నారు. అందుకే ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరం అవ్వాలని డిసైడ్ అయినట్టు ఓ ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ కొత్త కథలు వినడం లేదు. ప్రజా సమస్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కమిటైన సినిమాలు పూర్తి చేసి పవన్ కళ్యాణ్ సినిమాలకి గుడ్ బై చెబుతారని కొందరు చెప్పుకొస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో కొన్నాళ్ల పాటు పవన్ సినిమాలు చేయడం మానేశాడు. ఇక భవిష్యత్‌లో కూడా ఆయన సినిమాలకి దూరంగా ఉండే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తుంది.