Anna Leginova | ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌తో మోదీ పెద్ద స్కెచ్.. జ‌గ‌న్‌కి చెక్ పెట్టేందుకేనా?

Anna Leginova | ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌తో మోదీ పెద్ద స్కెచ్.. జ‌గ‌న్‌కి చెక్ పెట్టేందుకేనా?
Anna Leginova | ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌తో మోదీ పెద్ద స్కెచ్.. జ‌గ‌న్‌కి చెక్ పెట్టేందుకేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anna Leginova | గ‌త రెండు రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ Pawan Kalyan భార్య అన్నా లెజినోవా Anna Leginova సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారింది. సింగపూర్‌లో పవన్, అన్నా లెజినోవా Anna Leginova దంపతుల కుమారుడు మార్క్ శంకర్ Mark Shankar అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తన కుమారుడు కోలుకోవాలంటూ శ్రీవారిని మొక్కుకున్నారు అన్నా కొణిదెల. మార్క్ శంకర్ Mark Shankar త్వరగానే కోలుకోవడంతో మొక్కును తీర్చుకునేందుకు ఆదివారం తిరుమలకు వచ్చి మొక్కుని తీర్చుకుంది అన్నా. టీటీడీ TDP నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌పై సంతకం చేసి ఆమె వరాహస్వామిని Lord Varaha swamy దర్శించుకున్నారు. ఆపై పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకుని.. శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించారు.

Advertisement
Advertisement

Anna Leginova | బీజేపీ ప్లాన్..!

అక్కడ నుంచి నేరుగా ఆలయ సాంప్రదాయంను పాటిస్తూ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల Tirumala చేరుకున్న సమయం నుంచి ప్రతీ అడుగు లోనూ అన్నా లెజినోవా టీటీడీ సంప్రదాలను TTD traditions పూర్తిగా అనుస‌రించారు అన్నా లెజీనోవా. దేవుడికి హారతి ఇచ్చారు. కొబ్బరి కాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు. సింగపూర్ లో Singapore తమ కుమారుడు గాయ పడి కోలుకోవటంతో తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకోవాలని అన్నా లెజినోవా నిర్ణయించి.. ఈ మేరకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. దేశం కాని దేశంలో పుట్టి.. చిన్ననాటి నుంచి క్రిస్టియానిటీలో పెరిగిన ఆమె తిరుమలకు Tirumala రావడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. వెంకన్న స్వామిపై Venkanna Swamy నమ్మకం ఉందని డిక్లరేషన్‌పై సంతకం పెట్ట‌డం, ఓ స్త్రీ అయి ఉండి తలనీలాలు కూడా సమర్పించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Pawan Kalyan : మీకు మాకు క‌టీఫ్‌.. డిప్యూటీ సీఎం లెక్క తేల్చేశాడుగా..!

అంతేనా అన్నప్రసాదానికి Anna Prasad రూ.17లక్షలు కూడా డొనేట్‌ చేశారు. పవన్‌ భార్య గుండు కొట్టించుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పరిస్థితి. పవన్‌ సతీమణి ఏదో దేశం నుంచి వచ్చి, పరమతంలో ఉండి కూడా డిక్లరేషన్‌ ఇచ్చి తలనీలాలు సమర్పించుకుంటే, జగన్‌ Jagan మాత్రం ఇగోకి పోయి హిందూమతాన్ని అవమానించారని ఇప్పుడు హిందూ సంఘాలు, వాట్సప్‌ గ్రూపుల్లో WhatsApp groups పెద్దఎత్తున చ‌ర్చ న‌డుస్తుంది. ఈ ఒక్క ఘటనతో యావత్తు హిందువుల మనసుల్లో పవన్‌ తన స్థానం పదిలం కాగా, ఓటు బ్యాంకు కూడా సాలిడ్‌గా పెంచేసుకున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ జరగడం చూస్తే… బీజేపీ ఇచ్చిన రూట్‌మ్యాప్‌ను పవన్‌ పక్కాగా అమలు చేస్తున్నారని, జగన్‌ ys jagan ఇగోపై కూడా నెమ్మదిగా దెబ్బేసి ఓ వర్గం ఓటు బ్యాంకు సంపాదించే పనిలో పవన్‌ ఉన్నట్లు స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంది.

Advertisement