అక్షరటుడే, వెబ్‌డెస్క్: mark shankar | పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ Deputy Chief Minister Pawan Kalyan చిన్న కొడుకు మార్క్ శంకర్ mark shankar ఇటీవల అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంతగానో కంగారు పడ్డారు. ఏప్రిల్ 8న ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడు మార్క్ శంకర్ దట్టమైన పొగ కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటనే సిబ్బంది మార్క్ శంకరును సింగపూర్ లోని Singapore ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న మార్క్ శంకర్‌ని ఇండియాకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ దంపతులు. భార్య అన్నా లెజినోవా, కొడుకు మార్క్ శంకర్‌తో కలిసి పవన్ శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
mark shankar | మహా జాతకం
ఎయిర్‌పోర్టులో airport పవన్ తన కొడుకుని ఎత్తుకుని వస్తోన్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలసట కారణంగా మార్క్ శంకర్ mark shankar తండ్రి భుజాలపై నిద్రపోతుండగా.. కాస్త దూరం వెళ్లాక తల్లి అన్నా లెజినోవా అతడిని తీసుకుని తన భుజాలపై పడుకోబెట్టుకున్నారు. అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటంతో తెలుగు రాష్ట్రాల Telugu states ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధానమంత్రి మోదీ Prime Minister Modi సహా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు opposition leaders, ప్రజా ప్రతినిధులు, సెలబ్రెటీలు పవన్‌కి సానుభూతి ప్రకటిస్తూ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మార్క్ శంకర్‌కి mark shankar సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10న జన్మించారు. అయితే ఆయన జాతకం ప్రకారం భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు అవుతాడని ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ famous numerologist Kiran Nehru జోష్యం చెప్పారు. బాలుడు పూర్తి పేరు కొణిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ కాగా, న్యూమరాలజీ ప్రకారం 9/2 కాంబినేషన్ ఉందని, ఈ కాంబినేషన్లో ఉండే పేర్లు కలిగిన వాళ్లు గొప్ప శక్తిని కలిగి ఉంటారని చెప్పారు. అలాగే 2025న వారికి స్వల్పపాటి ప్రమాదాలు కూడా ఎదురవుతాయని చెప్పుకొచ్చారు. మార్క్ శంకర్ mark shankar పేరు వాడకంలో ఉండడం ద్వారా 16 నెంబర్ వస్తుందని దానివల్ల జీవితంలో ఒక్కసారిగా పైకి లేచి కింద పడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు.