Advertisement
అక్షరటుడే ఇందూరు: PROPERTY TAX | నగర ప్రజలు ఆస్తిపన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్ కోరారు. ఆదివారం నగరంలోని 28వ డివిజన్లో పర్యటించారు. అనంతరం జోన్–3 కార్యాలయంలో సిబ్బంది హాజరు, ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. దీర్ఘకాలంగా బకాయిలు ఉన్న ఇంటి యజమానులు వెంటనే పన్నులు చెల్లించాలని సూచించారు. ఆయన వెంట బిల్ కలెక్టర్లు, జవాన్లు తదితరులున్నారు.
Advertisement