అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రధాని మోదీ మద్దతుతోనే అదానీ దురాగతాలు పెరిగాయని పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చాక ధనికులు, పేదలు అనే వ్యత్యాసం పెరిగిపోయిందన్నారు. అమెరికాలో అదానీ కుంభకోణం బయటపడ్డ తర్వాతే మోదీ, అదానీ బంధం అందరికీ తెలిసిందన్నారు. అర్హత లేకున్నా అదానీ కంపెనీలు రుణాలు పొందాయన్నారు. అదానీ అరెస్ట్‌ అయితే మోదీ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్‌ చేశారు.