అక్షరుటుడే, ఇందూరు: జిల్లా గాండ్ల సంఘం క్యాలెండర్లను పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ హైదరాబాద్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం కమ్యూనిటీ హాల్ కోసం ఎకరం స్థలం కేటాయించాలని పీసీసీ చీఫ్‌ను వారు కోరారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సాయన్న, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు నాగరాజు, క్యాషియర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement