అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ మాతృమూర్తిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఆమెకు ఇటీవల మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. నాయకులు గడుగు గంగాధర్, సునీల్ రెడ్డి, జావిద్ అక్రం, బబ్లుఖాన్, రాంభూపాల్, బీఎల్ రాజు, రఘువీర్ సింగ్, మహేందర్ ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  BC reservations | ఢిల్లీకి తరలిన బీసీ నాయకులు