అక్షరటుడే, ఇందూరు: ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వారు ఓపికతో ఉండాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం నుడా ఛైర్మన్ ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఉంటూ కష్టపడుతున్న వారికి భవిష్యత్తులో తప్పకుండా పదవులు వరిస్తాయన్నారు. కేశ వేణు నిబద్ధతగల నాయకుడని కొనియాడారు.