అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని మగ్గిడి ఉన్నత పాఠశాలలో బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్ -19 వాలీబాల్ జట్ల ఎంపిక నిర్వహించినట్లు పీడీ మధు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 10 నుంచి 13 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం హరిత, జిల్లా కబడ్డీ సెక్రెటరీ గంగారెడ్డి, రాజ్ కుమార్, పీఈటీలు యాదగిరి, శ్రీనివాస్, సురేష్, మధు, భూపతి, రాజేందర్, మురళి, అనూష, నిఖిత పాల్గొన్నారు.