అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: జాతీయస్థాయి అండర్-17 బాలికల హాకీ టోర్నీకి జడ్పీహెచ్‌ఎస్ గర్గుల్ పాఠశాల విద్యార్థులు రణబోయిన ప్రవళిక, కమ్మరి భవానీ ఎంపికైనట్లు పీడీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి 27కు హర్యానాలోని రొహుతక్‌లో జాతీయ టోర్నీ జరగుతుందన్నారు. హెచ్‌ఎం ఎల్లయ్య, పీడీ నోముల మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు, క్రీడాకారులను అభినందించారు.