బీఎడ్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

0

అక్షరటుడే, ఆర్మూర్‌: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆర్మూర్‌లోని ప్రియదర్శిని బీఎడ్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌ యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా కళాశాలను నడుపుతూ.. డెవలప్‌మెంట్‌ పేరుతో రూ.వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిఖిల్‌, బిరుగొండ, కృష్ణ, కార్తీక్‌, ఈశ్వర్‌, రిశీత్‌ పాల్గొన్నారు.