అక్షరటుడే, ఆర్మూర్: బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అన్యాయం చేసిందని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ అన్నారు. ఆదివారం ఆర్మూర్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం 7.75 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. విద్యా వ్యవస్థ సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీపక్, కార్తిక్, సాయి కృష్ణ, శ్రీకాంత్, రాజా శివ, చిన్ను, చింటూ పాల్గొన్నారు.