అక్ష‌ర‌టుడే, పెద్దపల్లి: జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 21 నాటికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 149 వాహనాలను సీజ్ చేసి అక్ర‌మార్కుల‌కు రూ.25,99,790 జరిమానా విధించినట్లు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించే వాహ‌నాల్లో 86 ట్రాక్టర్లు, 63 టిప్పర్లను ఉన్నాయ‌ని వాటిని పట్టుకొని నిందితుల‌పై కేసులు న‌మోదు చేశామ‌ని వెల్ల‌డించారు.