అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : కులగణన పక్కాగా నిర్వహించాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకట్రాములు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో అయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా కూడా పక్కాగా చేపట్టాలన్నారు. సమావేశంలో కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, కమిటీ సభ్యులు నర్రకళ, చంద్రకాంత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.