PRTU NIZAMABAD | పెండింగ్​ డీఏలను విడుదల చేయాలి

PRTU NIZAMABAD | పెండింగ్​ డీఏలను విడుదల చేయాలి
PRTU NIZAMABAD | పెండింగ్​ డీఏలను విడుదల చేయాలి

అక్షరటుడే, ఇందూరు: PRTU NIZAMABAD | పెండింగ్​లో ఉన్న ఐదు డీఏ(DA)లను విడుదల చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు(PRTU Telangana District President) కృపాల్​సింగ్(Kripal Singh)​ డిమాండ్​ చేశారు. పీఆర్టీయూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(PRTU Telangana Formation Day) సందర్భంగా బుధవారం నగరంలోని వర్ని చౌరస్తాలోని పార్టీ కార్యాలయం(Party Office)లో సంఘం జెండాను ఆవిష్కరించారు.

Advertisement

అనంతరం ఆయన మాట్లాడుతూ 51శాతం పీఆర్సీ(PRC)ని ప్రకటించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు అనుగుణంగా పారితోషికం చెల్లించాలని, ఎస్ఎస్​ఏ ఉద్యోగుల(SSA employees) సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రవీందర్, నాగేశ్వరరావు, గంగాధర్, జావీద్, రాము, దేవానంద స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement