అక్షరటుడే,బోధన్‌ : విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం బోధన్‌ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని దయానంద్‌ గోశాలలో మంగళవారం పెన్షనర్ల దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, అతిథులుగా ఏటీవో పుష్పలత, మార్కెట్‌ కమిటీ ఛైర్ పర్సన్‌ అంకు సంధ్య దాములు హాజరయ్యారు. ఈసందర్భంగా సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికి ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని.. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పోతంగల్‌లో వయో వృద్ధులకు, విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చిన్న భవనాన్ని నిర్మిస్తామని సంబంధిత దరఖాస్తు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సూదం మదన్‌మోహన్‌, బోధన్‌ డివిజన్‌ అధ్యక్షులు కృష్ణా రావు, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్‌, ఉపాధ్యక్షులు పార్శి ప్రకాశం, కోశాధికారి సత్యానందం, జిల్లా ఈపీఎఫ్‌ వయో వృద్ధుల పెన్షనర్ల సంఘం అధ్యక్షులు అద్దంకి ఈశాన్య, జిల్లా కోశాధికారి నారాయణ, నిజామాబాద్‌ డివిజన్‌ అధ్యక్షులు శీర్ప హన్మాండ్లు, సర్ప లింగం, కార్యవర్గ సభ్యలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement