Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: పసిడి పరుగులు ఆగడం లేదు. నిత్యం బంగారం ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో వివాహాలు ఉండడంతో చాలా మంది పసిడి ఆభరణాల కొనుగోళ్లకు ప్లాన్​ చేసుకున్నారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని కలవరపెడుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్​ మార్కెట్​లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.87,430 పలుకుతోంది. 22 క్యారెట్ల ధర రూ.80,960గా ఉంది.

Advertisement