అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంను (command control room) పరిశీలించారు. ఈ చలాన్ ఏ విధంగా వేస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల(CCTV cameras) పాత్ర కీలకమన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వారిని సీసీ కెమెరాల(CCTV cameras )ద్వారా గుర్తించి ఈ-చలాన్ (e-challans) విధించాలని సూచించారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్స్ ను వెంటనే చెల్లించాలని కోరారు.
Kamareddy SP | వాహనాలపై ప్రత్యేక నిఘా..
లైసెన్సు, నంబర్ ప్లేట్ number plate సక్రమంగా లేని, నంబర్ ట్యాంపరింగ్ చేసిన వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన వాహనాలపై ఆయా పోలీస్ స్టేషన్లలో police stations కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.