KAMAREDDY | తాగునీటి కోసం ప్రజలు రోడ్లపైకి రావొద్దు
KAMAREDDY | తాగునీటి కోసం ప్రజలు రోడ్లపైకి రావొద్దు
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: KAMAREDDY |వేసవికాలంలో(SUMMER) నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం రోడ్డెక్కవద్దని.. సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత జీపీ కార్యదర్శులదేనని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి(MLA VENKATA RAMANA REDDY) అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముందస్తు ప్రణాళికతో నీటి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. అవసరమైన ప్రతిపాదనలు స్థానిక అవసరాల ఆధారంగా స్పష్టంగా ఒకే ఫార్మాట్​లో సిద్ధం చేయాలని సూచించారు. వచ్చే జూన్ మాసం వరకు నీటి సమస్యలు రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న ట్యాంకర్లు అందుబాటులోకి తీసుకురావాలని, ఏమైనా మరమ్మతులు ఉంటే చేయించాలని సూచించారు.

KAMAREDDY | 48 గ్రామాలకు నిధులు కేటాయించాం: కలెక్టర్​

కామారెడ్డి నియోజకవర్గంలో 48 గ్రామాల్లో రూ.53.36 లక్షల నిధులు కేటాయించామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(COLLECTOR ASHISH SANGWAN) తెలిపారు. ఆ నిధులతో ఆయా గ్రామాల్లో పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసి తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ పరిధిలో ఇప్పటికే 5 కొత్త ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నామని, పాతవి 3 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పక్షంలో మరో 4 ట్యాంకర్లు కొనుగోళ్లు చేస్తామన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  NIZAMABAD CITY | తాగునీటి కొరత రాకుండా చూడాలి

KAMAREDDY | జీపీ నిధులు సమకూర్చాలి

గ్రామాల్లో ఏమైనా సమస్యలొస్తే జీపీ నిధుల నుంచి పనులు చేపట్టాలని, అవసరమైతే ఇతర నిధులు సమకూరుస్తామని కలెక్టర్​ తెలిపారు. ఇకముందు తాగునీటి ఇబ్బందులు ఉన్న చోట్ల అవసర నిమిత్తం ప్రతిపాదనలు సమర్పించాలని మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వరకు డీఐ కొత్త పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రమేశ్​, జిల్లా పంచాయతీ అధికారి మురళి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఎంపీడీవోలు, డీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement