అక్షరటుడే, వెబ్‌డెస్క్ : దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తుండగా గాయపడే వారికి బీమా కల్పించేందుకు ఫోన్‌పే కొత్త తరహా బీమా పాలసీని తీసుకొచ్చింది. రూ.9 చెల్లించడం ద్వారా రూ.25 వేల వరకు కవరేజీ లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదవశాత్తు ఎవరైనా టపాసులు కాల్చి గాయపడితే వారికి ఈ బీమా అండగా నిలుస్తుంది. అక్టోబర్ 25 నుంచి 10 రోజుల పాటు ఈ బీమా కవరేజీ లభిస్తుందని, ఫోన్‌పే యూజర్‌తో పాటు భార్య పిల్లలు సహా నలుగురు వ్యక్తుల వరకు సమగ్ర కవరేజీ కూడా తీసుకోవచ్చని పేర్కొంది. ఫోన్‌పేలోని ఇన్సూరెన్స్ సెక్షన్‌లోకి వెళ్లి ‘ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్’ ఎంపిక చేసుకొని వివరాలు ఇచ్చి పాలసీని కొనుగోలు చేయాలి. దీపావళి కోసం బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్లు ఫోన్‌పే తెలిపింది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement