Pawan Kalyan : ప‌వ‌న్‌ని గెలిపించిన వ‌ర్మ‌కి వెన్నుపోటు.. ఎమ్మెల్సీ సీటు ద‌క్క‌క‌పోవ‌డంతో అస‌హ‌నం

Pawan Kalyan : ప‌వ‌న్‌ని గెలిపించిన వ‌ర్మ‌కి వెన్నుపోటు.. ఎమ్మెల్సీ సీటు ద‌క్క‌క‌పోవ‌డంతో అస‌హ‌నం
Pawan Kalyan : ప‌వ‌న్‌ని గెలిపించిన వ‌ర్మ‌కి వెన్నుపోటు.. ఎమ్మెల్సీ సీటు ద‌క్క‌క‌పోవ‌డంతో అస‌హ‌నం
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Pawan Kalyan : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కొంద‌రికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎవ‌రికి ఎమ్మెల్సీ ద‌క్కుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆశ‌గా ఎదురు చూశారు. అయితే కూటమిలోని జనసేన, బీజేపీకి ఒక్కో ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. టీడీపీ నుంచి పలువురు ఆశావాహులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసిన బీసీ నాయ‌కుడికి మాత్రమే ఛాన్స్ దొరికింది. సీనియర్ నేత యనమలకు సీటు రెన్యువల్ చేయలేదు. పార్టీ సీనియర్లు.. సీట్లు త్యాగం చేసిన వారికి ఈసారి అవ‌కాశం దక్కలేదు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు.

Pawan Kalyan : వ‌ర్మకి మొండి చేయి..

2027లో మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయిని.. వాటిలో ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు చెప్పమన్నారంటూ ఆశావాహులకు ఫోన్ చేసి వివరించారు ప‌ల్లా. సీనియర్ నేతల్లో యనమల.. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు సీట్లు ఇవ్వక పోవటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అయితే య‌న‌మ‌ల‌కి సీటు ఇవ్వ‌క‌పోవ‌డంలో పెద్దగా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అందుకు కార‌ణం ఆయ‌న కుటుంబం నుండి ముగ్గురు ప‌దవుల్లో ఉన్నారు. ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యేగా.. వియ్యంకుడు మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, అల్లుడు మహాశ్ ఏలూరు ఎంపీగా ఉన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Naga Babu : చిరంజీవి, ప‌వ‌న్‌కి నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

అందుకే యనమలకు సీటు రెన్యువల్ చేయలేదని చెబుతున్నారు. మ‌రోవైపు పిఠాపురం నేత వర్మకు సీటు విషయంలోనూ ఆసక్తి కర చర్చ మొదలైంది. పవన్ కు సీటు కేటాయించి ఆయన గెలుపు కోసం వర్మ ఎంతో కృషి చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక వ‌ర్మ‌కి త‌గిన ప్రాధాన్యత ఇస్తామ‌ని కూడా అన్నారు. అయితే తాజాగా త‌న‌కు సీటు కేటాయించ‌క‌పోవ‌డం ప‌ట్ల వ‌ర్మ చాలా ఆవేద‌న‌తో ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం సీటు త్యాగం చేసినా కానీ తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని వ‌ర్మ త‌న సొంత వాళ్ల ద‌గ్గ‌ర చెబుతున్న‌ట్టు తెలుస్తుంది.

Advertisement