అక్షరటుడే, జుక్కల్ : పిట్లం ఏఎంసీ పరిధిలోని మహమ్మద్ నగర్ మండలంలో నాబార్డ్ గోదాం, వ్యవసాయ మార్కెటింగ్ శిక్షణ కేంద్రానికి స్థలం కేటాయించాలని ఛైర్మన్ మనోజ్ కుమార్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు వినతిపత్రం అందజేశారు. గోదాం, శిక్షణ కేంద్రం కోసం 15 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.