అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoist | గుట్ట చుట్టూ బాంబులు పెట్టామని, ప్రజలు అటువైపు రావొద్దని మావోయిస్టులు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ములుగు(Mulugu) జిల్లా వాజేడు – వెంకటాపురం ఏరియా కమిటీ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆపరేషన్ కగార్(Opearation Kagar) పేరుతో కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు(Encounters) చేస్తుందని ఆరోపించారు. ఈ ఎన్కౌంటర్లతో మావోయిస్టులతో పాటు అనేక మంది అమాయక గిరిజనులు చనిపోతున్నారని పేర్కొన్నారు.
ఆపరేషన్ కగార్ నుంచి తమను రక్షించుకోవడానికి వెంకటాపురం మండలం కర్రిగుట్ట చుట్టూ బాంబులు పెట్టినట్లు వారు లేఖలో పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని కోరారు. డబ్బులు ఆశచూపి, మాయ మాటలు చెప్పి ప్రజలను పోలీసులు ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని ఆ లేఖలో ఆరోపించారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై కూడా లేఖలో విమర్శించారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.