అక్షరటుడే, వెబ్‌డెస్క్ Vastu Tips : చాలామంది ఇంటి ఆవరణంలో ఎన్నో మొక్కల్ని నాడుతారు. అందులో కొన్ని మొక్కలు సానుకూలత శక్తిని మనకు అందిస్తాయి. ఈ మొక్కలు మన ఇంటి చుట్టూ అందంగా అలంకరణకై కూడా ఉంటాయి. చెట్లు గాలిని శుభ్రపరచుటకు, ప్రాణవాయువును ఇస్తుంది. Vastu Tips వాస్తు శాస్త్రంలో మొక్కలను ఇంట్లో నాటే చెట్టు, మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి చుట్టూ ఆవరణంలోనూ, ఇంటికి ఎదురుగాను వివిధ రకాల మొక్కలను నాటుతున్నారు. ఇలా చేస్తే ఇంటి అందం పెరగడమే కాదు, ఆనందం, శ్రేయస్, సానుకూల శక్తిని తెచ్చే చాలా ప్రత్యేకమైన చెట్లు శాస్త్రంలో పరిగణించబడ్డాయి. మనం ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకుంటాం. అలాగే ఆ ఇంట్లో మొక్కలను కూడా అందంగా అలంకరణ కోసం అంతే నాటుతాం. అయితే వాస్తు శాస్త్రంలో తెలియజేసిన ప్రతి ఒక్క నియమాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. వాస్తు శాస్త్రం చెప్పిన విధంగా ఏ మొక్కని నాటాలి, ఏం చేస్తే మన జీవితం సంతోషంగా, సంపన్నంగా సాగుతుంది.
ఎ మొక్కలని పెంచుకోవాలి : ఎంత ఇష్టంతో ఇంటి నిర్మాణం చేసుకుంటామో, అంతే ఇష్టంగా వాస్తు శాస్త్రం ప్రకారం , లో ఉన్న వస్తువులని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే, ఇంటి ఆవరణంలోని మొక్కలను కూడా అదే విధంగా అందం కోసం పెంచుకుంటాం. ఎటువంటి మొక్కలను పెంచాలి. ఈ మొక్కల నియమాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. శాస్త్రంలో ఎటువంటి నియమాలను చెబుతారు అవి పాటించాలి. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చెట్లు ఉండాలి అని వాస్తు శాస్త్రం చెబుతుంది. రోజుల్లో పట్టణాలలో మొక్కలు స్థలం లేని వారు, కనీసం కుండీలలోనైనా నాటాలి. మీ ఇంటి వాతావరణం ఆక్సీకరణంతో నిండి ఉంటుంది. ఈ విధంగా మొక్కల్ని ఇంటి బయట నాటితే, మనకు జీవితంలో సంతోషాలు, సంపన్నులుగాను జీవనాన్ని గడుపుతాం. ఇంటి ఆవరణంలో పెంచుకోగలిగే మొక్కల్లో ఒకటి ” నిమ్మ మొక్క “. అయితే ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకునే విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు తెలియజేస్తున్నారు..
ఇంట్లో నిమ్మ చెట్లను పెంచుకుంటే వాటికి తగిన సరైన స్థలం ఎంచుకోవడం ముఖ్యం. నిమ్మ మొక్కను తప్పుదిశలో గనక నాటారు అనుకో దీనివల్ల ప్రయోజనం ఏమో కానీ ఎంతో హాని కలిగే ప్రమాదం ఉంది. నిమ్మ చెట్టు నీ నాటాలి అనుకుంటున్నారా.. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఇంకా నిమ్మ చెట్టు నీ ఇంటికి ఎడమవైపున, లేదా కుడి వైపున నాటాల అనే విషయం కూడా సందేహమే . ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం… మీ ఇంట్లో సరైన దిశలో నిమ్మచెట్టును గనుక, నాటారంటే ఆర్థిక శ్రేయస్సును మీకు లభిస్తుంది అని నమ్మకం. ఈ నిమ్మకాయలు ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలు నయం చేయగలదు. దీని ఆకులను, పండ్లను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
వాస్తు దోషం ఉన్నట్లయితే నిమ్మచెట్టును వల్ల దాని ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. శాస్త్రం ప్రకారం నిమ్మకాయ చెట్టు దృష్టిని,ప్రతీకూల శక్తిని కూడా తొలగించగలదు. మీ జాతకాలలో శని గ్రహ దుష్ప్రభావాలు ఉన్నా కూడా నిమ్మకాయ చెట్టు నాటడం వల్ల అంతా మీకు మంచే జరుగుతుంది. చేస్తే జాతకంలో శనీశ్వరుని ప్రతికూల శక్తి కూడా మీ ఇంటి పైన ఉండదు. మహానైనా రాహువు, కేతువుల ప్రభావాన్ని తగ్గించడానికి నిమ్మచెట్టు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జాతకం లో ఏదైనా గ్రహదోషాలు ఉంటే నిమ్మచెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోస్తే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో కూడా నిమ్మ చెట్టును నాటడం, ఇంటి ప్రధాన ద్వారం హుండీ వైపున నిమ్మ చెట్టును నాటడం శుభప్రదం అని చెబుతున్నారు నిపుణులు .