అక్షరటుడే, బిచ్కుంద: కౌలాస్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. 85 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా.. ప్రతిభ కనబర్చిన 12 మందిని ఎంపిక చేసినట్లు హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గంగామోహన్‌ చక్రు, ప్రధాన కార్యదర్శి సురేందర్‌ తెలిపారు. జనవరిలో హైదరాబాద్ లో జరిగే రెండో ఆలిండియా రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పీడీ సతీష్‌రెడ్డి, పీఈటీలు ప్రవీణ్, లింగం, సీనియర్‌ క్రీడాకారులు మహేష్, భాను పాల్గొన్నారు.