అక్షర టుడే, వెబ్ డెస్క్ :
ఇప్పటి వరకు 19 విడతల్లో కేంద్రం పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది. ఇటీవలే ఫిబ్రవరి 14న బీహార్ లోని భాగల్ పూర్ లో పీఎం మోదీ.. 19వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రూ.22,000 కోట్లను రైతులకు అందించారు. అయితే.. ఈ సారి చాలామంది రైతులకు డబ్బులు అందలేదు. దానికి కారణం.. అర్హత లేని రైతులను పీఎం కిసాన్ స్కీమ్ నుంచి తప్పించడం, ఈకేవైసీ చేయని రైతులను కూడా పీఎం కిసాన్ స్కీమ్ నుంచి తప్పించారు.
PM Kisan : పీఎం కిసాన్ కింద అనర్హులు వీళ్లే
ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఫించన్ పొందే వారు, ఎక్కువ మొత్తంలో వ్యవసాయ భూమి కలవారు, ప్రజా ప్రతినిధులు, ఇలా రకరకాల కేటగిరీలకు చెందిన వారిని పీఎం కిసాన్ కింద అనర్హులుగా ప్రకటించింది కేంద్రం. అలాగే.. అర్హత ఉన్నా కూడా ఈకేవైసీ చేయించని రైతులకు కూడా ఈసారి పీఎం కిసాన్ కింద డబ్బులు పడలేదు. అందుకే.. అర్హత ఉన్న రైతులు పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి తమ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇక.. 20 వ విడత డబ్బులు వచ్చే జూన్ 2025 లో పడనున్నాయి. ఇప్పటి వరకు 19 విడతల్లో భాగంగా 11 కోట్ల మంది రైతులకు 3.68 లక్షల కోట్ల డబ్బులను కేంద్రం డిపాజిట్ చేసింది.