అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మారిషస్ చేరుకున్నారు. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని నవీన్ రామ్‌గులం ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలికారు. మోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. బుధవారం జరిగే మారిషస్ జాతీయ దినోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
మారిషస్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కవాతులో భారతీయ సైనిక దళాలు పాల్గొంటున్నాయి. నౌకాదళ యుద్ధ విమానంతో పాటు వైమానిక దళానికి చెందిన ఆకాశ గంగా స్కై డైవింగ్ బృందం పాల్గొననున్నది. కాగా.. మారిషస్‌లోని ప్రవాస భారతీయులు ప్రధాని మోదీని స్వాగతించడానికి పెద్దఎత్తున తరలివచ్చారు.
PM Modi | పలు కీలక ఒప్పందాలు
రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. భారతదేశం – మారిషస్ మధ్య సామర్థ్య నిర్మాణం, వాణిజ్యం, సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం వంటి రంగాలలో సహకారం కోసం అనేక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ప్రధాని అన్నారు.