అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనకు విషెస్‌ చెబుతూ లేఖలు విడుదల చేశారు. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అర్వింద్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు.