Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించనున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. మోదీ ట్రంప్‌తో సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా మోదీని వైట్ హౌస్‌కు ఆహ్వానించానని ఆయన పేర్కొన్నారు.
Advertisement