Advertisement
అక్షరటుడే, బాన్సువాడ: Pocharam | మండలంలోని బుడ్మి గ్రామ శివారులో గల మంజీర నది ఒడ్డున శ్రీ హరిహర దేవి క్షేత్ర దేవాలయానికి బుధవారం వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తయితే మంజీర ఒడ్డున భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, బుడ్మి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Advertisement