అక్షరటుడే, వెబ్డెస్క్ : Polavaram | హైదరాబాద్ (Hyderabad)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో పోలవరం అథారిటీ polavaram autharity భేటీ నిర్వహించింది. అథారిటీ ఛైర్మన్ అతుల్ జైన్ athul jain ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ (Telangana) ఈఎన్సీ అనిల్ enc anil, ఏపీ(AP)కి చెందిన ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)కు సంబంధించిన అభ్యంతరాలను తెలంగాణ అధికారులు భేటీలో లేవనెత్తారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేయాలని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ కోరారు. ముంపు, బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నింపితే తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై స్పష్టత కావాలన్నారు. అయితే ముంపుపై కొత్తగా సర్వే అవసరం లేదని, గతంలో ఉన్న వివరాలు సరిపోతాయని ఏపీ అధికారులు వివరించారు. తెలంగాణ అధికారులు కోరినట్లు ముంపుపై సంయుక్త సర్వే చేయిస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేర్కొంది.