అక్షరటుడే, భిక్కనూరు: మాజీ సర్పంచుల ‘చలో అసెంబ్లీ’ని పోలీసులు అడ్డుకున్నారు. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భిక్కనూరు నుంచి హైదరాబాద్ కు తరలివెళ్లేందుకు సిద్ధమైన వారిని సోమవారం ఉదయం అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో తున్కి వేణు, శ్రీనివాస్, పోతిరెడ్డి, మన్మోహన్‌రెడ్డి, రమేశ్ రెడ్డి తదితరులున్నారు.