అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: నగరంలోని ముస్తాయిద్‌ పురాలో నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ఒకటో టౌన్‌ సీఐ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సంతోష్‌నగర్‌కు చెందిన వాస్టర్‌ రాజేశ్‌ ఈనెల 25న ముస్తాయిద్‌ పురా చౌరస్తా వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి గాజుల్‌పేట్‌కు చెందిన రాజు రాంజీ, నిజాంకాలనీకి చెందిన షేక్‌ సికందర్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. 25న వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం జరిగిన గొడవలో రాజురాంజీ, షేక సికందర్‌ కలిసి వాస్టర్‌ రాజేశ్‌ను నెట్టేయగా కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  POWER CUT | రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం