అక్షరటుడే, ఇందూరు: BETTING | ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్(Police Commissioner Nizamabad) IPS సాయి చైతన్య(Sai Chaitanya) తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు.
నగరంలోని భారతీరాణి కాలనీకి చెందిన షేక్ ముజీబ్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్(Online Cricket Betting) నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో ఐదో టౌన్ సిబ్బంది (Fifth Town nizamabad) తనిఖీ చేశారని తెలిపారు. సెల్ఫోన్లో బెట్టింగ్ సంబంధించిన ఆధారాలు ఉండడంతో షేక్ ముజీబ్‌తో పాటు షేక్ నదీమ్, షేక్ జునైద్, షేక్ రెహాన్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో నలుగురు షకీల్, నజీబ్, సచిన్, రమేష్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
సాలూర మండల కేంద్రానికి చెందిన షకీల్ నాందేడ్‌లో నివాసముంటున్న సచిన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. బెట్టింగ్(Betting)కు సంబంధించిన ఆన్లైన్ వివరాలను తెలుసుకొని ఏజెంట్(Agent)గా చేరాడు. ఇలా సచిన్ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని, వీలైనంత మందిని బెట్టింగ్ పట్ల ఆకర్షితులను చేశారన్నారు. పలు వెబ్సైట్(Websites)ల వివరాలను ఏజెంట్ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారన్నారు. కానీ అందులో విత్ డ్రా(Withdraw) చేయలేక పలువురు మోసపోయారని సీపీ(CP) తెలిపారు.
సుమారు వెయ్యి మంది అమాయకులను బెట్టింగ్ యాప్(Betting App)లో దించారని, మాస్టర్ ద్వారా ఏజెంట్ మూజీబ్ 7 శాతం కమీషన్ పొందినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.50 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, బ్యాంక్ పాస్ బుక్కు(Bank passbooks)లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఐదో టౌన్ ఎస్సైలు గంగాధర్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
BETTING | ఆర్మూర్లోనూ..
ఆర్మూర్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుల అరెస్టు వివరాలను సైతం సీపీ వెల్లడించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఆర్మూర్ సిబ్బంది ఎనిమిది మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందులో గౌతమ్, సునీల్, రంజిత్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నుంచి మూడు మొబైల్ ఫోన్లో, రూ.6 వేల నగదు, 34 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై మహేష్ తదితరులు పాల్గొన్నారు.
BETTING | రెండ్రోజుల క్రితమే ‘అక్షరటుడే’ కథనం..
జిల్లాలో బెట్టింగ్ దందాపై ‘అక్షరటుడే’ రెండు రోజుల క్రితం ప్రచురితం చేసింది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బూకీల ఆగడాలను ఎత్తి చూపించింది. ఈ నేపథ్యంలో సీపీ బెట్టింగ్ ముఠాలపై ఉక్కుపాదం మోపారు. నిజామాబాద్, ఆర్మూర్‌కు చెందిన ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.