Detained women | పరేడ్ గ్రౌండ్​లో మహిళలను నిర్బంధించిన పోలీసులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఘోర అవమానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఘోర అవమానం
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Detained women : సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో దారుణం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఘోర అవమానం జరిగింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ.. సీఎం రేవంత్​ రెడ్డి ఆయా జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులను రప్పించారు.

కాగా, మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలు బయటకు వెళ్లకుండా గేటుకు తాళాలు వేశారు. అత్యవసర పరిస్థితి ఉందని, గేటు తెరవండని వేడుకున్నా కనికరించలేదు. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారని కొందరు మహిళలు ప్రాధేయపడినా పోలీసులు పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిస్తేనే బయటకు పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Holi | హోలీ వేడుకలపై ఆంక్షలు