Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు నిందితులను గుర్తించారు. బీహార్‌కు చెందిన మనీష్ మరొకరితో కలిసి దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌ఘడ్, బీదర్‌లో నిందితులు దోపిడీలు చేశారు. మనీష్ పై బీహార్‌లో హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. కాగా వీరు బీదర్‌లో ఏటీఎంలో డబ్బులు జమ చేయడానికి తీసుకెళ్తున్న సిబ్బందిపై కాల్పులు జరిపి నగదుతో పరారైన విషయం తెలిసిందే. నిందితులు అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఇక్కడ అఫ్జల్‌గంజ్‌లోని ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగిపై కాల్పులు జరిపారు. నిందితుల కోసం పది బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  GHMC : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉప‌శ‌మ‌నం.. బకాయి వడ్డీపై 90 శాతం మినహాయింపు