Siricilla | లిఫ్ట్​ ప్రమాదం.. పోలీస్ అధికారి మృతి

Siricilla | లిఫ్ట్​ ప్రమాదం.. పోలీస్ అధికారి మృతి
Siricilla | లిఫ్ట్​ ప్రమాదం.. పోలీస్ అధికారి మృతి
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Siricilla | లిఫ్ట్​ ప్రమాదంలో ఓ పోలీస్​ ఉన్నతాధికారి మృతి చెందాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గంగారాం(55) రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సిరిసిల్లలోని ఓ అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి ఓ పార్టీకి వెళ్లిన గంగారాం లిఫ్ట్​లో కిందకు వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్​ రాకముందే.. వచ్చిందనుకొని డోర్​ ఓపెన్​ చేశాడు. దీంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.

Siricilla | కేటీఆర్​ సంతాపం

లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కమాండెంట్ గంగారాం స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామం. ఆయనకు భార్య రేఖ, కొడుకు (సతీష్) కుమార్ ఇద్దరు కూతుర్లు (గౌతమి, మీనల్) ఉన్నారు. కాగా గాంగరాం గతంలో తెలంగాణ సెక్రటేరియట్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన మృతిపై కేటీఆర్​ సంతాపం తెలిపారు.

Advertisement