అక్షరటుడే, వెబ్‌డెస్క్: బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. నిరసనకు కారణమైన 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి పోలీస్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజులుగా వివిధ బెటాలియన్ల పరిధిలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదట కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా శనివారం కానిస్టేబుళ్లే నేరుగా నిరసన తెలిపారు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కానిస్టేబుళ్లపై వేటు వేసింది. ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల పాత్ర ఉందని డీజీపీ అనుమానం వ్యక్తం చేశారు.