కామారెడ్డి, అక్షరటుడే: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన మెప్మా ఆర్పీలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ధర్నాకు వెళ్లడానికి శుక్రవారం ఉదయం కామారెడ్డి బస్టాండ్ కు చేరుకున్న వీరిని పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ధర్నాకు వెళ్తున్నామన్నారు. పోలీసులు తమను అరెస్టు చేయడం శోచనీయమని వాపోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించి వెంటనే వేతనాలు పెంచాలని కోరారు.