అక్షరటుడే, బాన్సువాడ: కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో పేకాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 46 వేలు, తొమ్మిది సెల్ ఫోన్ లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.