అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని నాలుగో టౌన్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి జరిపారు. పాంగ్రా శివారులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్సై సంజీవ్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు జరిపారు. ఓ విటుడితో పాటు విటురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకురాలు పర్వీన్ బేగంపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.