Police raids | వడ్డీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు.. అసలు వ్యాపారులు చిక్కేనా..!

Police raids | వడ్డీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు
Police raids | వడ్డీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు

అక్షరటుడే, ఇందూరు: Police raids : నిజామాబాద్​ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు వడ్డీ వ్యాపారులపై మెరుపు దాడులు చేస్తున్నారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

నిజామాబాద్​, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పలు చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పలువురు వ్యాపారుల ఇళ్లపై దాడులు చేపట్టారు. సామాన్యులు, చిరు వ్యాపారుల అవసరాలను ఆసరాగా చేరుకుని, అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు.

Police raids : ​బడా వ్యాపారులు ఉన్నారా..!

ఉభయ జిల్లాల్లో వడ్డీ వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. నిజామాబాద్​ జిల్లాలో.. ప్రధానంగా ఆర్మూర్​ పట్టణంలో చిరు వ్యాపారుల రక్తం పీల్చుతున్నారనే చెప్పాలి. ఇక్కడ వడ్డీ వ్యాపారుల దోపిడీ అధికంగా ఉంటోంది. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఓ స్టార్ హోటల్ నిర్వాహకుడు, మాజీ ప్రజాప్రతినిధి, మరో సౌకారి డాక్టర్, ఇద్దరు మార్వాడి వ్యాపారులు పెద్ద మొత్తంలో వడ్డీ దందా నిర్వహిస్తున్నారు. ఒక విధంగా వీరిది వడ్డీ వ్యాపారమే ప్రధాన బిజినెస్.

ఇది కూడా చ‌ద‌వండి :  Moneylenders | వడ్డీ వ్యాపారులు గప్​చుప్​.. పోలీసుల తనిఖీలతో దందాకు బ్రేక్​..!

ఖరీదైన ఖాళీ స్థలాలు, భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని కోట్ల రూపాయల్లో వడ్డీ దందా సాగిస్తున్నారు. నిజామాబాద్​ బైపాస్ రోడ్డులో ఓ వెంచర్ కోసం రూ.20 కోట్లు అప్పుగా ఇచ్చి.. తీరా వెంచర్ కాజేసిన ఉదంతం పోలీసుల దృష్టిలోనూ ఉంది. మరి ఈ బడా వ్యాపారులంతా తాజా చిట్టాలో ఉన్నారా..? అనేది మరి కాసేపట్లో తేలనుంది.

కాగా.. ఇటీవల కామారెడ్డి జిల్లాలో వడ్డీ వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేసి పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్​ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై సీపీ సాయిచైతన్య దృష్టి సారించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

Advertisement