Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NIZAMABAD POLICE | నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో బుధవారం లారీ, బైక్ ఢీకొనగా.. బైక్పై ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై పడి ఉన్న గాజుపెంకులను ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఊడ్చేసి శుభ్రం చేశారు. వెంటనే స్పందించిన పోలీసుల తీరును పలువురు అభినందించారు.
Advertisement