అక్షరటుడే, వెబ్డెస్క్ : Sri Ram Navami | శ్రీరామనవమి సందర్భంగా ప్రతి గ్రామంలో రాములోరి కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 6న శ్రీరామ నవమికి అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హైదరాబాద్(Hyderabad)లో మాత్రం శ్రీరామ నవమి అంటే శోభాయాత్ర(Shobayatra) గుర్తుకు వస్తుంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ సారి కూడా శోభాయాత్రను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శోభాయాత్ర నిర్వాహుకులతో సీపీ ఆనంద్(CP Anand) గురువారం సమావేశం నిర్వహించారు.
Sri Ram Navami | భారీ బందోబస్తు
శోభాయాత్ర సాగే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. సకాలంలో యాత్ర ప్రారంభించాలని ఆయన సూచించారు. తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు వినియోగించాలని, డీజే సౌండ్లు తక్కువగా పెట్టుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా యాత్ర సాగేలా సహకరించాలన్నారు. శోభాయాత్రలో డ్రోన్లు వినియోగించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు.