అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Politics | రాష్ట్రంలో తీవ్ర రాజకీయ అనిశ్చిత నెలకొంది. ప్రధాన పార్టీల్లో ఆధిపత్య supremacy పోరు నడుస్తోంది. కాంగ్రెస్ Congress, బీఆర్ఎస్ BRS, బీజేపీ BJP పార్టీలు ఏవీ ఇందుకు మినహాయింపు కావు. అధికార పార్టీలో ruling party పదవుల లొల్లి తారాస్థాయికి చేరగా, ప్రతిపక్ష పార్టీల్లోనూ opposition parties అదే పరిస్థితి కనిపిస్తోంది.
మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవుల nominated posts కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలకు Congress leaders నిరాశే మిగులుతోంది. నెలల తరబడి కేబినెట్ విస్తరణ cabinet expansion వాయిదా పడుతుండడంతో వారిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. దీంతో ఆశావాహులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. పార్టీలో నడుస్తున్న కీచులాటపై ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు MLAs చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఇక, ప్రతిపక్ష బీఆర్ఎస్‌లోనూ BRS ముగ్గురు కీలక నేతల నడుమ ఆధిపత్య పోరు power struggle నడుస్తోంది. అటు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలోనూ అసంతృప్త రాగాలు వినిపిస్తున్నాయి.
Telangana Politics | అధికార పార్టీలో కీచులాటలు..
కాంగ్రెస్ పార్టీలో Congress party కీచులాటలు సహజమే. అధికారంలో ఉన్నప్పుడే ఇవి అధికంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రికి Chief Minister, మంత్రులకు Minister మధ్య సఖ్యత కొరవడడం, పాలనలో సమన్వయం లోపించడం తరచూ కనిపిస్తోంది. రుణమాఫీ loan waiver, రైతుభరోసా Rythu Bharosa, బీసీ గణన BC census తదితర ప్రభుత్వ కీలక నిర్ణయాలపై key government decisions గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలు గందరగోళానికి దారి తీశాయి. సీఎం రేవంత్‌రెడ్డికి CM Revanth Reddy కొందరు మంత్రులు సహకరించడం లేదని పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నారు. రేవంత్ ముందుకు వెళ్లకుండా కాళ్లలో కట్టెలు పెడుతూ తరచూ కొందరు అమాత్యులు, పార్టీ ముఖ్య నేతలు important party leaders తరచూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల కేబినెట్ విస్తరణకు ప్రయత్నించగా, ఒకరిద్దరు సీనియర్ నేతలు హైకమాండ్‌కు high command లేఖలు రాయడంతో విస్తరణకు బ్రేక్ పడింది. దీనిపై కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి ధర్మరాజులా కాకుండా ధ్రుతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.
ఆయన లేఖ రాయడం వల్లే కేబినెట్ విస్తరణ cabinet expansion వాయిదా పడిందన్నారు. మరోవైపు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ MLA Premsagar కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో నెలకొన్న అసంతృప్తిని బయటపెట్టాయి. పదేండ్లు పార్టీని కాపాడుకున్న తమను కాదని, వేరే పార్టీల నుంచి తిరిగి వచ్చిన వారికి పదవులిస్తారా? అని నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. అమాత్య పదవుల కోసం సీనియర్ ఎమ్మెల్యేలు senior MLAs చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో పార్టీని పలుచన చేస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ పథకాలపై government schemes, ప్రతిపక్ష విమర్శలపై ఎవరూ స్పందించక పోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి CM Revanth Reddy తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇటీవల నిర్వహించిన సీఎల్పీ భేటీలో CLP meeting ఇదే అంశంపై ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్ట లేకపోవడంపై, ప్రభుత్వ పథకాలను government schemes ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. పదవుల విషయంలో నోరు మెదపొద్దని సూచించడం.. పార్టీలో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతోంది.
Telangana Politics | ప్రతిపక్షంలోనూ అదే పరిస్థితి..
ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీఆర్ఎస్ లోనూ ఆధిపత్య పోరు నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు పార్టీ నేతలతో సమావేశమవుతున్నా, జనబాహుళ్యంలోకి మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో ఆధిపత్యం పెంచుకునేందుకు కీలక నేతలు తలపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వంపై పోరాటం పేరుతో కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు కవిత ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అసెంబ్లీలోనూ, బయటా సర్కారును ఇరుకున పెట్డడంలో కేటీఆర్, హరీశ్‌రావు తమదైన శైలిలో ఎవరికి వారు ఎత్తులు వేస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ కాస్త వెనక్కు తగ్గారు. అదే సమయంలో కవిత కూడా రంగంలోకి దిగారు. మొన్నటిదాకా బీసీ సంఘాల సమావేశాల పేరిట జిల్లాలను చుట్టేశారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా మండలి ఆవరణలో సొంతంగా నిరసనలు చేపట్టారు. ముగ్గురు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాల్లో, బయటా చర్చ జరుగుతోంది.
Telangana Politics | కాషాయ దళంలో అసంతృప్త రాగాలు..
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కాషాయ దళంలోనూ ఆధిపత్య పోరు నడుస్తోంది. అధ్యక్ష పదవి బరిలో ఉన్న కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఇటీవల ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్‌రావు తదితరులు మాట్లాడిన తీరుపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందర బండి సంజయ్‌ను దింపేసిన బీజేపీ అధిష్టానం కొద్దిరోజుల కోసం అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించింది. అప్పటి నుంచి ఆయన నేతృత్వంలోనే రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్‌పై పోరాడుతోంది. తదుపరి అధ్యక్షుడిని నియమించడంలో జరుగుతున్న తాత్సారం ఆశావహుల్లో అసంతృప్తిని రాజేస్తోంది. మరోవైపు, రాజాసాంగ్ వంటి సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.